అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.25.73 లక్షలు పట్టుబడ్డాయి. సోమవారం ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేపట్టగా..మోర కిరణ్ అనే వ్యక్తి నుంచి ఈ నగదును సీజ్ చేసినట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. సీఐ నరహరి, ఎస్సై సంజీవ్, సిబ్బంది రామకృష్ణ, రమేష్ ను ఏసీపీ అభినందించారు.