రూ.6 కోట్ల ధాన్యం పక్కదారి.. రైస్ మిల్లు సీజ్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: జిల్లాలో ఓ రైస్ మిల్లు నిర్వాహకుడు ఏకంగా రూ.6 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. పక్కా సమాచారంతో సివిల్ సప్లై, పోలీసు అధికారులు దాడి జరిపి సదరు మిల్లును సీజ్ చేశారు. నవిపేట్ మండలం అభంగపట్నం శివారులోని ఓ మిల్లుకు సంబంధించి రెండు సీజన్ల సీఎంఆర్ కోటా బకాయిలు ఉన్నాయి. ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులకు సమాచారం అందడంతో మంగళవారం తనిఖీలు జరిపారు. మిల్లులో సీఎంఆర్ కోటా లేకపోవడంతో బయట విక్రయించుకున్నట్లు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ.6 కోట్లు పైబడి ఉంటుందని తెలిసింది. ప్రస్తుతానికి మిల్లు సీజ్ చేశామని, ఇంకా లెక్కలు తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. నవిపేట్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.