రెవెన్యూ శాఖకు పూర్వవైభవం రావాలి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: రెవెన్యూ శాఖకు పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా రాష్ట్ర నాయకత్వం పని చేస్తుందనే భరోసా ఉందని ట్రేసా జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జిల్లా కమిటీ తరపున ఆయన ప్రాతినిథ్యం వహించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏ లు లేని లోటును ఆయన గుర్తుచేశారు. గతంలో వీరు శాఖలో సేవలు అందించిన సమయంలో అధికారులకు ఎలాంటి పనిభారం లేకుండా ఉండేదన్నారు. రెవెన్యూ శాఖకు గత వైభవం తేవడం కోసం రాష్ట్ర నాయకత్వానికి తమవంతు మద్దతు ఇస్తామని తెలిపారు. నిజామాబాద్ నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.