అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని ఆశ ఆస్పత్రిలో రోగి బంధువులపై సిబ్బంది దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన కమ్మర్పల్లికి చెందిన లక్ష్మయ్యను మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్పించారు. రోగిని సరిగ్గా పట్టించుకోకపోవడం లేదని కుటుంబీకులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. తమపై ఆస్పత్రి సిబ్బంది దాడి చేశారని రోగి కుటుంబీకులు ఆరోపించారు. దాడిని నిరసిస్తూ తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ ఆస్పత్రిపై గతంలోను ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకొని దాడి చేయిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.