అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన ఉమేష్(23) శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మెదక్ వెళ్తుండగా మార్గమధ్యలో శెట్పల్లి సంగారెడ్డి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎల్లారెడ్డి జియో కార్యాలయంలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.