అక్షరటుడే, బోధన్: సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద బైక్ పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు కోటగిరి మండలం సోంపూర్ గ్రామానికి చెందిన సురేష్ గా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.