లయన్స్ క్లబ్ ఆడిటోరియం ప్రారంభం

0

అక్షరటుడే, బోధన్: పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ ఐ హాస్పిటల్ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అమెరికాకు చెందిన ప్రతినిధులు శీయాన్, లోరి శీయాన్ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా డా. బాబురావు, విజయ్ కుమార్ రాజు, తూము పద్మ శరత్ రెడ్డి, లక్ష్మీ, నగేష్, నరేందర్ రెడ్డి, చిన్న కిషన్ రెడ్డి, నరసింహారెడ్డి, బసవేశ్వర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మరియు అధ్యక్షుడు బసవేశ్వర్, కె.వి.రెడ్డి మనవడు ప్రభు రెడ్డి మాట్లాడుతూ.. కె.వి.రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల చదువుల కోసం సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.