అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని కోటగల్లి లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్సులో బుధవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. లిఫ్టులో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి దాదాపు గంట పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు రెస్క్యూ టీం సిబ్బంది చేరుకుని అతన్ని ప్రాణాలతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మహేందర్ గౌడ్ రెండు కాళ్ళు విరిగినట్లు సమాచారం. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ షాపింగ్ కాంప్లెక్సులోని ఓ అంతస్థులో హెచ్ డి ఎఫ్ సీ హౌసింగ్ లోన్ బ్యాంక్ ఉంది. ఇదే బ్యాంక్ లో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కి దిగేక్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి అందులోనే ఇరుక్కుపోయాడు. మహేందర్ అరుపులు పెట్టడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లిఫ్టు నిర్వహణ పక్కాగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
లిఫ్టులో ఇరుక్కున్న బ్యాంక్ సెక్యూరిటీ గార్డు
Advertisement
Advertisement