వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని మహారాష్ట్ర మాజీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ అశోక్ చవాన్ అన్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ తరపున లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. కెసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నారు. బిజెపి – బీఆర్ఎస్ పదేళ్లపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ సారధ్యంలో దేశమంతా కాంగ్రెస్ హవా నడుస్తుందని.. దాని ముందు బీజేపీ, బీఆర్ఎస్ నిలబడలేవని అశోక్ చవాన్ స్పష్టం చేశారు.