వర్ని రోడ్డులో గంజాయి పట్టివేత

0

అక్షరటుడే, నిజామాబాద్ నగరం: నగరంలోని వర్ని రోడ్డులో భారీగా గంజాయి పట్టుబడింది. అటవీ శాఖ కార్యాలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు జరిపారు. షేక్ అజాంను అదుపులోకి తీసుకొని అతడి నుంచి 1.3 కేజీల గంజాయి సీజ్ చేశారు. తనిఖీల్లో నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ బి.దిలీప్, ఎస్సై మల్లేష్, సిబ్బంది షబ్బీర్, ప్రభాకర్, సంగయ్య, రవి, సంజయ్ పాల్గొన్నారు.