అక్షరటుడే, బాన్సువాడ: వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వర్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి అవినీతి అక్రమాలకు పాల్పడడంతో పాటు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని విచారణలో తేలింది. దీంతో శ్రీనివాస్ ను విధుల నుంచి తొలగించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు వెల్లడించారు.