వాహనదారులు నిబంధనలు పాటించాలి

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: వాహనదారులు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను శుక్రవారం డీటీసీ వెంకటరమణతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజల్లో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. వాహనదారులు హెల్మెట్‌ తప్పకుండా ధరించాలని సూచించారు. డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్లు వినియోగించ కూడదన్నారు. కార్యక్రమంలో ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Turmeric | పసుపు రైతుల ఆందోళన..మంత్రి తుమ్మల కీలక ప్రకటన