అక్షరటుడే, నిజామాబాద్: నగర శివారులోని బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. గురువారం భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 20 మంది బాధిత విద్యార్థులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారు.