అక్షరటుడే, బోధన్: నిజామాబాద్ జిల్లా సాలూరకు చెందిన వీర జవాన్ గంగాప్రసాద్ అంతిమ సంస్కారాలు ఆదివారం ముగిశాయి. కమ్మాన్ పల్లి గ్రామంలో ఆర్మీ అధికారిక లాంఛనాలతో జవాన్ కు కుటుంబీకులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సీపీ వి.సత్యనారాయణ జావాన్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. సిక్కిం వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు కాగా అందులో సాలూరకు చెందిన మృతుడు గంగాప్రసాద్ ఒకరు.


