అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ శివారులోని మల్లారం సమీపంలో దారుణ హత్య జరిగింది. అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గొంతుకోసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. కుడి చేతిపై గాయత్రి అనే పేరు ఉన్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.