అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలంలోని సిద్దాపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ ను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి మంగళవారం పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని గుత్తేదారును ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు.