అక్షరటుడే, నిజామాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కలిశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు సీఎంను మర్యాదపూర్వ కంగా కలుసుకున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు నేతలు తెలిపారు.