అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం ట్రేసా నాయకులు కలిశారు. హైదరాబాద్ లో సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, చక్రవర్తి, బాణాల రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖను బలోపేతం చేసి, గ్రామ పరిపాలన వ్యవస్థని పునర్నిర్మించాల్సిందిగా సీఎంను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని సంఘం నేతలు తెలిపారు.