అక్షరటుడే, బాన్సువాడ: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. తన విజయానికి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకుల గెలుపు కోసం తాను పని చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు హామీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో కత్తెర గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బద్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.