హామీలన్నీ అమలు చేస్తాం

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గురువారం నాగిరెడ్డి పేట్ మండలం పోచారం ప్రాజెక్ట్ నుంచి రైతులకు యాసంగి నీటిని విడుదల చేశారు. ఏప్రిల్ వరకు నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.