హిందువుల కల సాకారం కాబోతోంది

Advertisement

అక్షరటుడే, ఇందూరు: అయోధ్య రామమందిరం పునప్రారంభంతో హిందువుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. రామమందిరంలో సీతారాముల విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనను పురస్కరించుకొని గురువారం నగరంలోని ఖిల్లా రామాలయంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణతో కలిసి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 500 ఏళ్ల నాటి హిందువుల కల ఈ నెల 22న నెరవేరబోతుందన్నారు. రామ మందిర ప్రారంభోత్సవం రోజు ప్రతిఒక్కరూ ఆలయాల్లో పూజలు, హోమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆలయం కోసం ఎందరో కరసేవకులు ప్రాణాలు అర్పించారని.. వారందరి ఆత్మ శాంతిస్తుందన్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని టీవీల్లో చూస్తూ రామ పారాయణం చేయాలన్నారు. దగ్గరలోని ఆలయాల్లో భజనలు చేయాలని, మహిళలు దీపారాధన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, మమత, సుధీర్‌, నారాయణ, పంచరెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad rural : ఎంపీ అర్వింద్ వ్యాఖ్య‌లు సరికావు