‘హిట్‌ అండ్‌ రన్‌’ను తొలగించాలి

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వాహనదారుల చట్టంలోని ‘హిట్‌ అండ్‌ రన్‌’ నిబంధనను తొలగించాలని కోరుతూ జిల్లా డ్రైవర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ.. హిట్‌ అండ్‌ రన్‌ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తాము ఏడాదికి కనీసం రూ.లక్ష కూడా సంపాదించలేమని.. రోడ్డు ప్రమాదం జరిగితే పదేళ్ల శిక్ష విధించడం దారుణమన్నారు. వెంటనే ఈ నిబంధనను ఎత్తివేయాలని కోరారు.