అక్రమంగా తరలిస్తున్న సీఎంఆర్ ధాన్యం పట్టివేత

0

అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలంలో సీఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని అధికారులు సీజ్ చేశారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మంగళవారం వర్ని మండల కేంద్రంలో తనిఖీలు జరిపారు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. కోటగిరి మండలంలోని ఓ రైస్ మిల్ నుంచి 374 క్వింటాళ్ల ధాన్యం అక్రమంగా మిర్యాలగూడకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డిటి నిఖిల్ రాజ్ వెల్లడించారు. వర్ని ఎస్ఐ కృష్ణకుమార్, ఎన్ఫోర్స్మెంట్ డిటి అశ్వక్ ఉన్నారు.