అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ బరిలో ఉన్న ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సాయినగర్ లో నివాసం ఉండే కన్నయ్య గౌడ్(35) శనివారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. అర్బన్ నియోజకవర్గం స్థానంలో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి కన్నయ్య గౌడ్ పోటీ చేస్తున్నాడు. ఈయనకు రోటీ మేకర్ సింబల్ కూడా కేటాయించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.