అర్బన్ బరిలో సూర్యనారాయణ

0

అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా ధన్ పాల్ సూర్యనారాయణ పేరు ఖాయమైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా సూర్యనారాయణ కు ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. విజయం సాధించి రావాలని ఆయన సూచించినట్లు సమాచారం. అనంతరం ఆయన ఇంటి వద్ద పార్టీ నాయకులు సంబరాలు జరిపారు. కొద్ది సేపట్లో బీజేపీ మొదటి జాబితాను అధిష్ఠానం అధికారికంగా విడుదల చేయనుంది. అర్బన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గణేశ్ గుప్తా మరోసారి బరిలో నిలుస్తున్నారు. సూర్యనారాయణ, గణేశ్ గుప్తా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు కాంగ్రెస్ తరపున బీసీ లేదా మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపేలా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది.