అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పై సొంత పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కొద్ది సేపట్లో తెరపడనుంది. ఉదయం 11 గంటలకు ఆర్మూర్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. కాగా ఈ అవిశ్వాస తీర్మానంలో బీజేపీ కౌన్సిలర్లు కీలకంగా మారారు. అయితే తమ మద్దతు ఎవరికి అన్నది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అవిశ్వాస పరీక్షలో పాల్గొంటారా? లేక గైర్హాజరు అవుతారా? అన్నది ఇంకా స్పష్టత లేదు. ఎంపీ అరవింద్ మాత్రం స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నిర్ణయం మీదే వదిలేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. దీంతో బీజేపీ కౌన్సిలర్లు అనుసరించే తీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.