ఆకుల లలితను నమ్మొద్దు

0

మున్నూరుకాపులకు అర్వింద్ సూచన

అక్షరటుడే, నిజామాబాద్: మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను మున్నూరు కాపులు, మైనార్టీలు నమ్మవద్దని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. నిజామాబాద్ లో జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో మున్నూరు కాపు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ను లలిత మోసం చేసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని, తాజాగా అదే డీఎస్ కొడుకు సీటును గుంజుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై మున్నూరుకాపు సోదరులు, మైనార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రేవంత్, కవిత వ్యాపార భాగస్వాములు అని.. ఆకుల లలితను కావాలని కాంగ్రెస్ కు పంపి కవిత టికెట్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ తరపున బలమైన అభ్యర్థి బరిలో ఉంటారని, ఆయన గెలవటం ఖాయమని అన్నారు.