అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. బుధవారం సీడీఎంఏ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. కౌన్సిలర్లు ఆకుల రాము, శంకర్, నర్సా రెడ్డి, ఖాందేష్ శ్రీనివాస్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.