ఆర్మూర్ మున్సిపల్ లో నెగ్గిన అవిశ్వాసం

0

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్ పర్సన్ పండిత్ వినితపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానంపై గురువారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 20 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నలుగురు బిజెపి కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో హోదాలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. చైర్ పర్సన్ పండిత్ వినీత ఆమె మద్దతుదారులు మాత్రం హాజరుకాలేదు. సరిపడా కోరం ఉండటంతో అవిశ్వాస పరీక్ష నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుత చైర్ పర్సన్ పండిత్ వినీత తన పదవిని కోల్పోయారు. త్వరలోనే కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా కలెక్టర్ మరోమారు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటం నెగ్గిందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

.