ఆర్మూర్ లో భారీ చోరీ

0

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని మహాలక్ష్మీ మందిరం సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు ఈశ్వర చంద్ర మామిడిపల్లిలోని ఓ బ్యాంకు లాకర్ లో ఉంచిన సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలను తీసుకొని వచ్చి మహాలక్ష్మీ మందిర ప్రాంతంలో కారును నిలిపి దైవదర్శనానికి వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి రాగా కారులో ఉంచిన బంగారం బ్యాగ్ లేకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు పిర్యాదు చేశారు. అడిషనల్ డీసీపీ జైరాం, ఏసీపీ కిరణ్ కుమార్, ఎస్ హెచ్ వో సురేష్ బాబు తనిఖీలు చేపట్టారు.