ఆలయంలో హుండీ చోరీ

అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం బోర్లంలోని ఆది బసవేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి మూడు హుండీలను పగలగొట్టారు. నందీశ్వరుని మెడలో ఉన్న వెండి గొలుసుతో పాటు హుండీలోని నగదు అపహరించుకెళ్లారు. పూజారి శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLC kavitha | బాన్సువాడను బంగారువాడగా మార్చాం