అక్షరటుడే, బాన్సువాడ: అయోధ్యలో ఈనెల 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అన్ని ఆలయాల్లో స్వచ్ఛ తీర్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 18న బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల వెంకటేశ్వర ఆలయంలో స్వచ్ఛ తీర్థ కార్యక్రమం ఉంటుందన్నారు. బాన్సువాడలోని స్పార్క్ మైండ్ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం బాధాకర విషయమని, పాఠశాలలో వందేమాతరం గీతాలాపన చేయడంలేదని ఆరోపించారు. సత్వరమే పాఠశాల యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.