అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీ పనులు చేపట్టేందుకు జిల్లా పరిషత్‌కు నిధులు కేటాయించాలని జడ్పీ ఛైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. గత జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు ఈ విషయమై విన్నవించారని కలెక్టర్‌కు వివరించారు.