ఎన్నికల హామీలను అమలు చేస్తాం

అక్షరటుడే, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం ఇందల్వాయి మండలంలోని పెద్దవాగుపై రూ.5 కోట్లతో వంతెన, గౌరారం వాగుపై రూ.7 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం తిర్మన్‌పల్లిలో 20 మంది యువకులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మెట్టు సాంప్సన్, అమృతపూర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి విరాళం ఇవ్వాల్సిందే : సీఎం