ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించినట్లు కవిత వెల్లడించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయిన హ్యాకర్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారని, ఈ విషయమై డీజీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.