ఎoఐఎంకు వ్యతిరేకంగా మైనార్టీల ధర్నా

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మైనార్టీలు ధర్నా చేపట్టారు. నగరంలోని గాంధీచౌక్ లో మైనార్టీ యువత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇటీవల మజ్లిస్ నేతలు తమ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. ఎంఐఎం నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు అందజేశారు. తమ సొంతవర్గం నుంచి వ్యతిరేకత ఎదురవ్వడాన్ని మజ్లిస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు ఇదే అంశంపై మైనార్టీలు, మజ్లిస్ నేతల మధ్య గత రెండ్రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది.