అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ కమిషనరేట్ ఏఆర్ ఎస్సై దేవీ సింగ్ సస్పెండ్ అయ్యారు. విధులు నుంచి తొలగిస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగో టౌన్ పరిధిలో జరిగిన ఓ వివాదానికి సంబంధించి దేవీ సింగ్ ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఎవరు విధుల్లో నిర్లక్ష్యం చేసినా, ఏ చిన్న ఆరోపణ వచ్చినా సీపీ కల్మేశ్వర్ సత్వరమే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందికి చార్జిమెమోలు ఇచ్చారు.