ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ..

0

ఎన్నికల వేళ సీఈసీ సంచలన నిర్ణయం

అక్షరటుడే, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో.. రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, రవాణా శాఖా కార్యదర్శి శ్రీనివాస రాజు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీతో పాటు ఎనిమిది జిల్లాల నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. రేపు సాయంత్రం లోగా ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో డైరెక్ట్ ఐఏఎస్, ఐపీఎస్ లను నియమించనున్నట్లు సమాచారం. వీరంతా కూడా అధికార బీఆరెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని తాజాగా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. పలువురు అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి విందులో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులుగా వీరి పనితీరు, గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని తాజా బదిలీలు చేసినట్లు సమాచారం.