అక్షరటుడే, నిజామాబాద్ నగరం: కరోనా పట్ల నిజామాబాద్ అర్బన్ ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ కేసులు వస్తున్నందున నగర ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నందున ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.