అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గడీల రాములు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. రూరల్ నియోజకవర్గానికి చెందిన రాములు ఇదివరకు ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో బాజిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన దూరం పెట్టిన తర్వాత బీఆర్ఎస్ లోనే కొనసాగిన రాములు ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Advertisement
Advertisement