కార్పొరేటర్ కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని ఎనిమిదవ డివిజన్ లోని కొందరు వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ విక్రమ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సిపిని కలిసి సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేసినట్లు విక్రమ్ తెలిపారు. తన డివిజన్ లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా.. కిషన్, వెంకటేష్, రాఘవేందర్ వర్కర్లను భయపెట్టి ‘మీ కార్పొరేటర్ అంతు చూస్తామని దౌర్జన్యం చేశారని’ ఆరోపించారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.