కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి

0

అక్షరటుడే, బోధన్: ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రమాదవశాత్తు మరణించిన జాకారం ప్రకాష్(30) కుటుంబ సభ్యులు గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ నెల 29న మెదక్ జిల్లా రామాయంపేట్ 44 నంబరు జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని బోధన్ మండలం పెంటఖుర్డు గ్రామానికి చెందిన జాకారం ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు హైదరాబాద్ కు వెళ్లి సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి ప్రకాష్ మరణించినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.