అక్షరటుడే, కామారెడ్డి: ప్రతిఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. ప్రతి ఒక్కరిపై కుటుంబం ఆధారపడి ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. సదాశివనగర్ మండలం మర్కల్‌లో మంగళవారం సీపీఆర్, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కార్యక్రమంతో పాటు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని సదాశివనగర్ మండలంలో జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తాగి వాహనాలు నడపవద్దని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించారు. అంతకుముందు ట్రాఫిక్ రూల్స్, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్, ఎల్లారెడ్డి డీఎస్పీ, రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ రాజన్న, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement