కుర్చీలు, ఫ్యాన్లకు కక్కుర్తి..

0

అక్షరటుడే, బోధన్: మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు బోధన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ ఎత్తుకెళ్లడం వివాదానికి దారి తీసింది. అధికారిక క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫ్యాన్లు, ఏసీలు, కుర్చీలను సోమవారం రాత్రి తరలిస్తుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అధికారిక క్యాంపు కార్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ కండోమ్ ప్యాకెట్లు లభించటంపైన కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.