అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: క్రీడల్లో రాణించే వారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలో పర్యటించిన ఆయన క్రీడాకారులు ఫరియా ఖానం, లాస్య ప్రియ, అక్షర శ్రినిధిని సన్మానించారు. తనవంతు సాయంగా ముగ్గురికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున కూడా సాయం అందించేలా చూస్తానని షబ్బీర్ అలీ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు షబ్బీర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కేశ వేణు, నరాల రత్నాకర్, జావేద్ అక్రమ్, నజీబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.