అక్షరటుడే, నిజామాబాద్: నగరానికి చెందిన కానిస్టేబుల్ రామాంజనేయులు కోఠి గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఉదయం రోల్ కాల్ విధుల్లో ఉండగా కోఠికి ఛాతిలో నొప్పి వచ్చింది. సహచర సిబ్బంది వెంటనే అతన్ని పోలీసు వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కోఠి ప్రస్తుతం నిజామాబాద్ ఐదో టౌన్ లో పని చేస్తున్నాడు.
Advertisement
Advertisement