అక్షరటుడే, నిజామాబాద్: జిల్లా గౌడ సంఘం అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని గౌడ యువజన సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు పుట్టనాతి కిషోర్ గౌడ్ తెలిపారు. యువజన సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా కిషోర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఎం నిఖిల్ గౌడ్, శంకర్ గౌడ్, నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విపుల్ గౌడ్, జిల్లా కార్యదర్శులుగా మణిగంటి నరేష్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, కోటగిరి కృష్ణ గౌడ్, నగర ప్రధాన కార్యదర్శిగా శ్రావణ్ గౌడ్, కార్యదర్శిగా నవీన్ గౌడ్, మాక్లుర్ అధ్యక్షునిగా కిష్టాపురం భవిత్ గౌడ్, చందూర్ కార్యదర్శిగా సాయ గౌడ్, నిజామాబాద్ రూరల్ అధ్యక్షునిగా బొడిగె శ్రీధర్ గౌడ్, డిచ్పల్లి అధ్యక్షునిగా సాయి ప్రమోద్, నవీపేట్ అధ్యక్షునిగా భానుచందర్ గౌడ్, సిరికొండ అధ్యక్షునిగా అరుణ్ రాజ్ గౌడ్ ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కిషోర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ మారయ్య గౌడ్, గౌడ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, చెరుకు లక్ష్మణ్ గౌడ్ నూతన కమిటీని అభినందించారు.
గౌడ సంఘం అభివృద్ధికి కృషి
Advertisement
Advertisement