అక్షరటుడే, నిజాంసాగర్: Bonalu : నిజాంసాగర్ మండలం గోర్గల్ శివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం సాయంత్రం బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం జాతరను తలపించింది. ఉదయం నుంచి అమ్మవారికి ఓడి బియ్యం పోయడం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి పాల్గొన్నారు.