అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద భీమా కల్పించాలని కోరారు. సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.