అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే రోజు నలుగురు మందుబాబులకు జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ మార్నింగ్ కోర్టు న్యాయమూర్తి సయ్యద్ ఖధీర్ మంగళవారం తీర్పునిచ్చారు. ధర్పల్లికి చెందిన ఇద్దరికి ఎనిమిది రోజులు, నిజామాబాద్ కు చెందిన మరో ఇద్దరికి మూడ్రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి తాజా తీర్పు కఠిన హెచ్చరికను జారీ చేసినట్లైంది.